రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
హన్మకొండ అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని బుధవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఆల్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా కమిటీల పిలుపు మేరకు చేపట్టిన ఈకార్యక్రమంలో కార్మికులు, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సారంపల్లి వాసుదేవరెడ్డి, హంసారెడ్డి, నున్న అప్పారావు, ఏ.ధర్మరాజు, ఎమ్మెస్ రావు, గుమ్మడి రాజుల రాములు, టి.ఉప్పలయ్య, పుల్ల అశోక్, బొల్లారం సంపత్, బొట్ల భిక్షపతి, వేలు రజిత తదితరులు పాల్గొన్నారు.
వినాశకర విధానాలు వీడకపోతే ప్రతిఘటనే
న్యూశాయంపేట: కేంద్రం వినాశకర విధానాలు వీడకపోతే ప్రతిఘటన తప్పదని కేంద్ర ప్రభుత్వ విధానాలతో అసమానతలు పెరుగుతున్నాయని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేశ్ అన్నారు. బుధవారం రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ ఏకశిల పార్కు నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈసందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కన్వీనర్ కె.బాబురావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో నాయకులు వివిధ సంఘాల నాయకులు మాధవి, ముక్కెర రామస్వామి, ఎలకంటి రాజేందర్, బాబు, రాచర్ల బాలరాజు, శ్రీనివాస్, మొగిలి, కుమారస్వామి, ప్రతాప్, కుమార్, బషీర్, సాయిలు, రాజన్న, వీరయ్య, మోహన్‌రావు, ఇస్మాయిల్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులు, రైతుల డిమాండ్
కలెక్టరేట్ల ఎదుట భారీ ధర్నా
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి


