అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే బిల్లు చెల్లిస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. వరంగల్ 22, 27వ డివిజన్ల పరిధి పలు కాలనీల్లో బుధవారం సీసీ రోడ్డు పనుల్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సీసీ రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, ఎస్‌ఈ సత్యనా రాయణ, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ సతీష్, ఏఈలు మురళీకృష్ణ, హబీబ్, టీపీబీఓ నవీన్ ఉన్నారు.
చెత్త తరలించే వాహనాలపై ఆరా
చెత్తను తరలించే వాహనాలు, ఎదురవుతున్న సమస్యలపై కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆరా తీశారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సిస్టంలో కమిషనర్ వాహనాల పనితీరు తెలుసుకున్నారు. మరమ్మతుల కోసం వెహికిల్ షెడ్డులో ఎన్ని వాహనాలను పార్కింగ్ చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.


