క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
కేయూ క్యాంపస్ : చదువుతోపాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య సూచించారు. మంగళవారం కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్పోర్ట్స్‌డే సందర్భంగా వివిధ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భిక్షాలు మాట్లాడుతూ.. కళాశాలలో ప్రతి ఏటా విద్యార్థినులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ తూర్పాటి వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు త్రోబాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, రన్నింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యారణ్యపురి : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నుంచి మినహాయింపు ఇవ్వాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్) పిలుపు మేరకు టీఎస్‌యూటీఎఫ్ హనుమకొండ జిల్లా కమిటీ బాధ్యులు ప్రధానమంత్రికి ఈ–మెయిల్ ద్వారా మంగళవారం అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి.కిరణ్‌కుమార్ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి రెండునెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం దీనిపైన సమీక్ష చేయడం లేదన్నారు. సీనియర్ టీచర్లకు ఉద్యోగాలపై భరోసా ఇవ్వడంలేదని ప్రధాన మంత్రికి పంపిన వినతిలో పేర్కొన్నట్లు వారు వెల్లడించారు. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం 2010 ఆగస్టు 28కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ అవసరం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల సర్వీస్‌చేసిన ఉపాధ్యాయులు టెట్ రాయాలని గతంలో ప్రభుత్వాలు పేర్కొనలేదని వారు తెలిపారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో విద్యాహక్కుచట్టం 2009ను సెక్షన్ 23ను సవరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ లింగారావు, ఎఫ్‌డబ్లూఎఫ్ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్‌రావు, బాధ్యులు రామ్మోహన్‌చారి పాల్గొన్నారు.
కాళోజీ సెంటర్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు వరంగల్ డీడబ్ల్యూఓ రాజమణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29న ఓసిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల దివ్యాంగులు సదరం, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఓసిటీ ఇండోర్ స్టేడియంలో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: వరంగల్ పోతననగర్‌లోని లాండ్రో మార్ట్‌ను వినియోగంలోకి తేవాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లను ఆదేశించారు. లాండ్రో మార్ట్‌ను మంగళవారం మేయర్ పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లాండ్రో మార్ట్‌ని యంత్రాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆపరేషన్, నిర్వహణ కోసం టెండర్ పిలిచి సాధ్యమైనంత తొందరగా మార్ట్ ను వినియోగంలోకి తేవాలని సూచించారు. ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ మహేందర్, శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను, ఏఈ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
నాలాల్లో సిల్ట్ తొలగించాలి..
నాలాల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. హనుమకొండ పరిధిలోని అంబేడ్క ర్ భవన్, పిస్తా హౌస్ ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో సిల్ట్ తొలగింపును మేయర్ దృష్టి సారించి సిల్ట్‌ను తొలగించాలని సూచించారు.
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి


