నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలోని రైస్ మిల్లర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 149 మిల్లులకు గాను 90 ఉపయోగంలో ఉన్నాయని, అందులో 57 మిల్లులకు ట్యాగింగ్ పూర్తయిందన్నారు. బ్యాంక్ గ్యారంటీ, ప్యాడీ క్లీనర్స్, టార్పాలిన్లు, గన్నీ బ్యాగ్‌లు, ఓపీఎంఎస్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు గోనెల రవీందర్‌రావు, సెక్రటరీ బూరెల సత్యనారాయణ, కోటేశ్వర్‌రావు, తోట సంపత్‌రావు పాల్గొన్నారు.


