గడువు తీరిన సరుకులు తిరిగి పంపించాలి
న్యూశాయంపేట: గడువు తీరిన సరుకులు రిటర్న్ పంపించాలని వరంగల్ అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డీబీసీడీఓ పుష్పలత, డీ ఈఓ రంగయ్యనాయుడు, డీఏఓ అనురాధ, భాగ్యలక్ష్మితో పాటు జిల్లాలోని హాస్టల్స్ ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గుడ్ల టెండర్స్ సప్లై చేసిన వెంటనే పరిశీలించి ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేయాలన్నారు. కుళ్లిపోయిన కూరగాయలను పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ కళాశాలల్లో నిర్వహించే ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ)తో ఉద్యోగావకాశాలకు మార్గం చూపుతుందని ఇంటర్మీడియట్ విద్యాశాఖ వరంగల్ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. సోమవారం హనుమకొండలోని రోహిణి ఆస్పత్రి, నర్సింగ్ కళాశాలలో ఆర్‌డీఎఫ్ ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఆన్ జాబ్ ట్రైనింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, రోజు వారీగా నేర్చుకునే రికార్డులను పరిశీలించారు.


