ప్రజలకు మెరుగైన సేవలందించాలి
● జిల్లా రిజిస్టార్ ప్రవీణ్‌కుమార్
ఖిలా వరంగల్: భూ రిజిస్టేషన్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకున్న ప్రజలకు మెరుగైన సేవలందించాలని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు శనివారం వరంగల్ హంటర్‌రోడ్డులోని ఖిలా వరంగల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కార్యాలయంలో సేవలు, ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డులు, సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించారు. సిబ్బంది పనితీరును సబ్ రిజిస్ట్రార్ వెంకట్‌లాల్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో పత్రాలు ఆన్‌లైన్ నమోదవుతున్న తీరును పరిశీలించి మాట్లాడారు. స్లాట్ బుకింగ్ చేసిన ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని, పెండింగ్ లేకుండా రికార్డులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.
సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏరువాక సాగుబడి
ఖిలా వరంగల్: సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరల తోటలు సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అధ్యక్షతన ఏరువాక సాగుబడిపై ఖిలా వరంగల్‌లో శనివారం కూరగాయల తోటల పరిశీలన, అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, మట్టి సంరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ సాగుతో భూమి సారవంతంగా ఉంటుందని తెలిపారు. డీఏఓ అనురాధ మాట్లాడుతూ రైతులు ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గినైజేషన్)గా ఏర్పడితే పంట ఉత్పత్తులను మార్కెట్‌లో మంచి ధరకు విక్రయించవచ్చని తెలిపారు. ఆకు కూరల సాగులో పాటించాల్సిన పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, పంట కోత సమయం వంటి అంశాలపై వ్యవసాయ అధికారి విజ్ఞాన్ అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ అధికారి తిరుపతి మాట్లాడుతూ కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులకు రూ.8వేలు ప్రోత్సాహకం, హైబ్రిడ్ కూరగాయలు సాగు చేసే వారికి రూ.9,500 ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, మాజీ కార్పొరేటర్ దామోదర్, స్థానిక నేత బోగి సురేశ్, ఏఈఓ చంద్రకాంత్, రైతులు శ్రీనివాస్, రమేశ్, సాంబయ్య, కుమార్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సైన్స్‌ఫెయిర్‌కు ఏర్పాట్లు చేయాలి
కాళోజీ సెంటర్: వరంగల్ ఉర్సు గుట్ట ప్రాంతంలోని తాళ్ల పద్మావతి పాఠశాలలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నుంచి నిర్వహించనున్న సైన్స్‌ఫెయిర్‌కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఉపాద్యాయుడు శ్రవణ్‌కుమార్ రూపొందిన సైన్స్‌ఫెయిర్ వెబ్‌సైట్‌ను శుక్రవారం కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మొౖబైల్ ఫోన్ ద్వారా క్యూర్ కోడ్‌ను స్కాన్‌చేసి సైన్స్‌ఫెయిర్ వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చునని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలి


