టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఇన్‌చార్జ్ పదోన్నతి..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఎట్టకేలకు ఇన్‌చార్జ్ పదోన్నతి కల్పించారు. నెలల తరబడి ఎదురుచూపులకు యాజమాన్యం ముగింపు పలికింది. కోర్టులో కేసులు విచారణ ఉండడంతో రెగ్యులర్ పదోన్నతికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫలితంగా పదోన్నతి ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తాయి. పదోన్నతి కల్పన తప్పని సరైనా కోర్టులో కేసులుండడంతో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో పాలన పరమైన ఇబ్బందులు తొలగించడంతోపాటు ఆశావహులను సంతృప్తి పరిచేందుకు యాజమాన్యం మధ్య మార్గంగా ఇన్‌చార్జ్ పదోన్నతి కల్పించింది. ఇన్‌చార్జ్ పదోన్నతితో ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూరవు. హోదా మాత్రమే మారుతుంది. ఈ క్రమంలో ముగ్గురు సూపరింటెండ్ ఇంజనీర్లకు చీఫ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు. అదే విధంగా ఆరుగురు డీఈలకు సూపరింటెండ్ ఇంజనీర్లగా, 21 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లకు డివిజనల్ ఇంజనీర్లగా, ఒక జనరల్ మేనేజర్‌కు జాయింట్ సెక్రటరీగా, ఇద్దరు అసిస్టెంట్ సెక్రెటరీలకు జనరల్ మేనేజర్లుగా, 8 మంది పర్సనల్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రెటరీలుగా, నలుగురు జూనియర్ పర్సనల్ ఆఫీసర్లకు పర్సనల్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించారు.
ఏడుగురు అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్
అకౌంట్స్ ఆఫీసర్లుగా పదోన్నతి..
ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఆపరేషన్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎ.సురేందర్‌కు ఇదే కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ ఆపరేషన్‌గా పదోన్నతి కల్పించారు. ఏడుగురు అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా, ఆరుగురు అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుుగా పదోన్నతి కల్పించారు. ఎమ్మార్టీలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎం.అన్నపూర్ణ దేవిని ఎమ్మార్టీ చీఫ్ ఇంజనీర్‌గా, కామారెడ్డి ఎస్‌ఈగా పని చేస్తున్న ఎన్.శ్రావణ్ కుమార్‌కు ప్లానింగ్, ఐటీ, స్కాడా చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి కల్పించారు. అదే విధంగా కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ పేషీలో డీఈ టెక్నికల్‌గా కొనసాగుతున్న సి.హెచ్.సంపత్ రెడ్డిని జనగామ ఎస్‌ఈగా నియమించారు. జనగామ ఎస్‌ఈగా పని చేస్తున్న వేణుమాధవ్‌ను ఆపరేషన్ జనరల్ మేనేజర్‌గా నియమించారు. సిరిసిల్ల సెస్ ఎండీగా కొనసాగుతున్న బి.భిక్షపతిని ఆపరేషన్–1 జనరల్ మేనేజర్‌గా నియమించారు. హనుమకొండ రూరల్ డివిజనల్ ఇంజనీర్‌గా కొనసాగుతున్న బి.సామ్యానాయక్‌ను కార్పొరేటర్ కార్యాలయంలో కమర్షియల్ జనరల్ మేనేజర్‌గా నియమించారు. వరంగల్ సర్కిల్ కార్యాలయం డీఈ టెక్నికల్ ఎ.ఆనందంను ములుగు ఎస్‌ఈగా నియమించారు. బెల్లంపల్లి డీఈ బి.రాజన్నను ఆసిఫాబాద్ ఎస్‌ఈగా నియమించారు. కార్పొరేట్ కార్యాలయంలో ఇండస్ట్రీయల్ రిలేషన్ జనరల్ మేనేజర్‌గా కొనసాగుతున్న శ్రీకృష్ణను జాయింట్ సెక్రటరీగా ఇదే కార్యాలయంలో నియమించారు. అసిస్టెంట్ సెక్రటరీలు కల్యాణ్, హేమంత్‌కు జనరల్ మేనేజర్‌గా పదో న్నతి కల్పించి ఇదే కార్యాలయంలో నియమించా రు. సీజీఆర్‌ఎఫ్ కార్యాలయం వరంగల్‌లో జనర ల్ మేనేజర్‌గా పని చేస్తున్న దేవేందర్‌ను ఇదే కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా నియమించా రు. సీజీఆర్‌ఎఫ్ నిజామాబాద్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న కిషన్‌ను కార్పొరేట్ కార్యాలయం అ కౌంట్స్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా నియమించారు.
నెరవేరిన ఆశావహుల కోరిక
ఫలించిన నెలల తరబడి ఎదురుచూపులు


