మహిళలకు అత్యధిక ప్రాధాన్యం
హన్మకొండ: మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ఆడిటోరియంలో వరంగల్ జిల్లా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సురేఖ హైదరాబాద్ నుంచి పాల్గొని వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ఎలాంటి అవకతవకలకు ఆ స్కారం లేకుండా పారదర్శకంగా చీరల పంపిణీ చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల్లో లేని 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో 1,19,818 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మహిళల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలో సర్పంచ్ ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ సీఎం మాటల రేవంతన్న కాదని, చే తల రేవంతన్న అన్నారు. రేవంత్ సర్కారు మహిళలకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తోందన్నారు. ఎమ్మె ల్యే కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఒక్క కు టుంబమే దోచుకుందని ఆరోపించారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌డీఓ రాంరెడ్డి, పాల్గొన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
మహిళలకు అత్యధిక ప్రాధాన్యం


