కేవీలో ఒకేషనల్ ల్యాబ్ నిర్మాణానికి భూమిపూజ
● జనవరి నుంచి అందుబాటులోకి..
కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం కడిపికొండలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో సెంట్రల్ సిలబస్‌తోపాటు వృత్తి విద్యా కోర్సులు అందించనున్నారు. ఇందుకు గాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పీఎంశ్రీ స్కీమ్‌లో భాగంగా రూ. 62లక్షలు మంజూరు కాగా అధికారులు శనివారం ఒకేషనల్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాగా, ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి జనవరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.
విద్యతోపాటు ఉద్యోగావకాశాల కల్పన..
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒకేషనల్ ల్యాబ్ తోడ్పడనుంది. ఈ ల్యాబ్‌లో వృత్తి విద్య కోర్సులు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీని అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, కేవీలో నిర్మించనున్న ఒకేషనల్ ల్యాబ్ పరిశ్రమలకు ప్రతిభను అందించే వేదికగా నిలువనుంది.
25నుంచి ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ప్రాథమిక విద్యను బోధిస్తున్న 45 పాఠశాలల నుంచి 45 మంది ఇన్‌స్ట్రక్టర్లకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో శిక్షణ కొనసాగనుంది. ప్రీప్రైమరీ తరగతులు కొనసాగిస్తున్న ఆయా ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలకు డిసెంబర్ 1న ప్రీ ప్రైమరీ నిర్వహణ పర్యవేక్షణపై హెచ్‌ఎంలకు డీఆర్పీలు శిక్షణ ఇస్తారు. ఆయాలు, ఇన్‌స్ట్రక్టర్లు సరిగ్గా విధులు నిర్వర్తించేలా పలు అంశాలపై డీఆర్పీలు ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రీప్రైమరీ తరగతుల విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ఇన్‌స్ట్రక్టర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని కోర్సు డైరెక్టర్, హనుమకొండ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్ తెలిపారు.
విద్యారణ్యపురి: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష– 2026కు డిసెంబర్ 5 వరకు గడువు ఉందని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడో తరగతి పరీ క్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పై ట్రేడ్‌లలో లోయర్ గ్రేడ్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులని తెలిపారు. లోయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ (లేదా) లోయ ర్ గ్రేడ్ పరీక్షకు సమాన ఉత్తీర్ణత సాధించినవారు సంబంధిత ట్రేడ్‌లో హయ్యర్ గ్రేడ్ పరీక్షకు హాజరుకావడానికి అర్హులని పేర్కొన్నారు. ఈపరీక్షలకు హా జరు కావాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.తెలంగాణ.గౌట్. ఇన్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆధార్ జిరాక్స్, స్టడీ సర్టిఫికెట్ జతపర్చి డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.


