అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శనివారం మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాతో కలిసి ఎన్‌హెచ్, పీఆర్, ఆర్‌అండ్‌బీ, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్, అటవీ, టూరిజం శాఖల అధికారులతో జాతరలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మల్లంపల్లి, కటాక్షపూర్ వద్ద జాతీయ రహదారి మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతరకు ముందస్తుగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తొద్దన్నారు. కాగా, రాత్రి సమయంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆదివాసీ మ్యూజియాన్ని సందర్శించి అందులోని పురాతన వస్తువులు, జీవన విధాన చిత్రాలను పరిశీలించారు. అనంతరం ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌ను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, ఏపీఓ వసంతరావు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
జాతరలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష


