దళిత పక్షపాతి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దళిత పక్షపాతి అని టీపీసీసీ రాష్ట్ర దళిత విభాగం సీనియర్ వైస్ చైర్మన్(ఆర్గనేజైషన్) డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు శనివారం హనుమకొండలోని తన కార్యా లయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటిక కూడా లేదని తెలుసుకుని మూడెకరాల భూమిని కేటాయించిన ఘనత ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిది అన్నారు. కొన్ని దశాబ్దాల వర్గీకరణ కల నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి తన డిప్యూటీ సీఎం పదవి పోవడానికి బీఆర్‌ఎస్, కేసీఆర్ కాదా అని, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశించి పలుమార్లు కేసీఆర్‌ను ఏకిపారేసిన మీరు ఇ ప్పుడు బీఆర్‌ఎస్‌లో ఎలా చేరారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రశ్నించారే తప్ప దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లడలేదన్నారు. వినయ్‌భాస్కర్ స వాల్‌ను స్వీకరించి బస్టాండ్‌కు చేరుకున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అక్కడి చిరువ్యాపారుల్లో ధైర్యం నింపిన విషయాన్ని మరవొద్దన్నారు. ఎమ్మెల్యే నాయి ని వ్యాఖ్యలను వక్రీకరించి అవాక్కులు పేలితే స హించేది లేదన్నారు. దుప్పటి కోటి, ప్రసన్నకుమార్, భాస్కర్, రాజేందర్, పోచయ్య, కృష్ణ, వెంకట్, రమేశ్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ దళిత విభాగం నాయకుడు
పెరుమాండ్ల రామకృష్ణ


