శిల్ప కళా సౌందర్యం మహాద్భుతం
ఖిలా వరంగల్ : కాకతీయుల నిర్మాణాలు, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతమని మహారాష్ట్ర కేడర్ డీఐజీ మోక్షిత పాటిల్( ఐపీఎస్) అన్నారు. చారి త్రక కాకతీయుల రాజధాని ఖిలావరంగల్‌కోట లో ని శిల్పాల ప్రాంగణాన్ని శనివారం మహారాష్ట్ర కేడ ర్ డీఐజీ మోక్షిత పాటిల్, ఆర్మీ రిక్రూట్మెంట్ అధి కారి కల్నల్ సునీల్, సౌత్ జోన్ డైరెక్టర్ ఏఆర్‌ఓ సి కింద్రాబాద్ సౌత్ జోన్ ఆర్మీ మేజర్ గౌరివ్‌తోపాటు ఓ కోచింగ్ సెంటర్‌లో గ్రూప్–2లో శిక్షణ పొందుతున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 200 మంది విద్యార్థులు వేర్వేరుగా సందర్శించారు. కీర్తితోరణాల మధ్య ఉన్న శిల్ప సంపదతోపాటు ఖుష్‌మాహాల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిల గుట్టను తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ గైడ్ రవియాదవ్ వివరించారు. నాటి కట్టడాలు, శిల్ప సంపద అద్భుతంగా ఉందని డీఐజీ కొనియాడారు. కోటను సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం టీజీ టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సౌండ్ అండ్ లైటింగ్ షోను తిలకించారు. వారి వెంట కేంద్రపురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్‌చార్జ్ గట్టి కొప్పుల అజయ్ ఉన్నారు.
మహారాష్ట్ర కేడర్ డీఐజీ మోక్షిత పాటిల్


