డీసీసీ అధ్యక్షుల నియామకం
● హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఇనగాల, వరంగల్‌కు అయూబ్‌ఖాన్
● ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం..
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇనగాల వెంకట్రాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వెంకట్రాంరెడ్డి ప్రస్తుతం ‘కుడా’ చైర్మన్‌గా ఉన్నారు. పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఇనగాల కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. తెలంగాణ నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్‌గా, పీసీసీ సభ్యుడిగా, పరకాల నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా పార్టీలో కొనసాగుతున్నారు. వెంకట్రాంరెడ్డి సతీమణి అవంతిరెడ్డి అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా, డీసీసీ పదవి కోసం అనేక రోజులుగా చూస్తున్న ఎదురుచూపులకు నేటితో తెరపడింది.
అయూబ్‌ఖాన్‌కు అవకాశం..
వరంగల్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహ్మద్ అయూబ్‌ఖాన్ నియమితులయ్యారు. వరంగల్ నగరానికి చెందిన అయూబ్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌నుంచి పలువురు నాయకులు పార్టీలు మారినా ఆయన మారకుండా పార్టీ విధేయుడిగా ఉన్నారు. రాష్ట్రంలో మైనార్టీకి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానం భావించి అదే కోటాలో అయూబ్‌ఖాన్‌కు పదవి ఇచ్చింది. అయూబ్‌ఖాన్‌ను కాంగ్రెస్ నాయకులు కాశిబుగ్గలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
డీసీసీ అధ్యక్షుల నియామకం


