గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలపర్చడమే సమాచార హక్కు చట్టం లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ శాఖల దరఖాస్తుల స్థితిని ఆరా తీశారు. స్వీకరించిన ఆర్టీఐ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు. హనుమకొండ జిల్లాలో 340 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. అందులో 46 దరఖాస్తులు తక్షణమే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. మిగతా దరఖాస్తులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై విచారణ జరిపిన కమిషనర్, సంబంధిత పీఐఓ అధికారులు, దరఖాస్తుదారుల నుంచి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రమేశ్ రాథోడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర సమాచార కమిషనర్
అయోధ్యరెడ్డి
అధికారులతో సమీక్ష


