సతాయిస్తున్న..‘సారథి’
ఖిలా వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సారథి ఆన్‌లైన్ పోర్టల్‌లో తరుచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలన్నా.. మరో లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నా సులభంగా ఉండేది. మీ సేవలో దరఖాస్తు చేసుకొని ట్రయల్ రన్‌కు వెళ్తే సరిపోయేది. ప్రస్తుతం అమలవుతున్న సారథి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడం కష్టంగా మారుతోంది. కొంతమంది దరఖాస్తుదారుల డేటా చూపించడం లేదు. వాహనదారుడు సారథి వెబ్‌సైట్‌లో హెవీ లైసెన్స్ రెన్యూవల్ నమోదు చేయగా..కార్యాలయానికి వెళ్తే హెవీ లైసెన్స్ నంబర్ మాయమైంది. బ్యాడ్జీ లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. దీంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. వైబ్‌సైట్‌లో తలెత్తుతున్న సమస్యలతో వాహనదారులు నెలల తరబడి తమ లైసెన్స్ రెన్యూవల్, మార్పు కోసం వేచి చూడాల్సి వస్తోంది.
రెండునెలల నుంచి అవస్థలే..
కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం సారథి పరి వాహన్ వెబ్‌సైట్‌ను నూతనంగా తీసుకొచ్చింది. కా నీ ఇప్పుడు వాహన లైసెన్స్ దారులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. డ్రైవింగ్ లైసెన్స్‌కు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలంటే 20 నిమిషాలు సమయం పడుతోంది. చివరికి వివరాలు నమోదు చేశాక సక్సెస్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడి ంది. కొంతమంది లైసెన్స్ దారుల డేటా మాత్రమే చూపిస్తూ.. ఇంకొంత మంది డాటా లేకపోవడంతో రెన్యూవల్‌తో పాటు స్థాయి పెంపుదలకు సంబంధించిన సమస్యలు తలెత్తున్నాయి. అంతేకాదు వాహనదారుల వ్యక్తిగత వివరాలు నమోదైన తర్వాత ఒకే కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని మీసేవ డేటా ఆపరేటర్లు చెబుతున్నారు.
సాంకేతిక సమస్యతో డేటామాయం
వాహనదారులకు తప్పని తిప్పలు
ఆర్టీఏ కార్యాలయం
చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు
సతాయిస్తున్న..‘సారథి’
సతాయిస్తున్న..‘సారథి’


