ఎయిర్‌పోర్ట్‌తో పారిశ్రామికాభివృద్ధి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ఇందుకు ఇళ్లు కోల్పోయిన వారు, భూ నిర్వాసితులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. ఇళ్లు కోల్పోయిన గాడిపల్లికి చెందిన 23 మంది, ఆర్‌అండ్‌ఆర్ కమిటీ సభ్యులతో గురువారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ 23మంది పరిహారం తీసుకోవడానికి సమ్మతించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఆర్ అండ్ ఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి
న్యూశాయంపేట: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఇసుక లభ్యత, రవాణా తదితర అంశాలపై సమీక్షించారు. కాగా, జలసంరక్షణ కేటగిరీ–2లో జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో అవార్డు అందుకున్న కలెక్టర్‌ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అభినందించారు.


