టీజీ ఎన్పీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక ‘ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అండ్ లార్డ్ డిస్కం’ అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 12న జరిగిన 19వ ఇండియా ఎనర్జీ సమ్మిట్– 13వ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డ్స్ ఫర్ డిస్కమ్స్ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ అవార్డు అందుకున్నారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్లు ఈ అవార్డును సీఎండీ వరుణ్ రెడ్డికి అందజేశారు. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో తీసుకున్న వినూత్న చర్యలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నారు. సంస్థలోని ప్రతీ ఉద్యోగి కృషికి ఈ అవార్డు ప్రతిఫలమన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకట రమణ, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం పాల్గొన్నారు.


