ముసాయిదా విత్తన బిల్లుపై సదస్సు
హన్మకొండ: వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం ముసాయిదా విత్తన బిల్లు–2025పై సదస్సు నిర్వహించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ఎ.విజయభాస్కర్ ముసాయిదా విత్తన బిల్లు–2025పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వరంగల్ డీఏఓ అనురాధ, ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్‌ఈఏసీ మెంబర్ యాదగిరి, శాస్త్రవేత్తలు, విత్తన ధ్రువీకరణ అధికా రులు, జాతీయ విత్తన సంస్థ, రైతు ఉత్పత్తిదారుల సంఘం, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


