కలెక్టరేట్‌లో వృద్ధుల దినోత్సవం
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లో జిల్లాస్థా యి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని బుధవా రం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద శారద హాజరై వేడుకలను ప్రారంభించి మాట్లాడా రు. కుటుంబ సభ్యులు వయోవృద్ధులకు మెరుగై న సేవలను అందించాలని కోరారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్ఫూర్తి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఉత్తమ సేవలందించిన వృద్ధులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, డీఎల్‌ఎస్‌ఏ అడ్వకేట్ సురేశ్, బ్రహ్మకుమారిస్ నుంచి సరిత సిస్టర్, వయోవృద్ధుల కమిటీ సభ్యుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


