సబ్ ఇంజనీర్‌కు గోల్డ్‌మెడల్
హన్మకొండ: తెలంగాణ అంతర్రాష్ట్ర క్రీడా పోటీల్లో టీజీ ఎన్పీడీసీఎల్ యువ ఇంజనీర్ డిస్కస్ త్రోలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకంతో మెరిశారు. ఈ నెల 17 నుంచి 19 వరకు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎమ్మార్టీ డివిజన్ ప్రొటెక్షన్‌లో సబ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాజారపు సందీప్ అత్యుత్తమ ప్రదర్శనతో డిస్కస్ త్రోలో మొదటి స్థానం సాధించారు. బంగారు పతకాన్ని అందుకున్నారు. విధులు నిర్వహిస్తూనే క్రీడల్లో రాణిస్తున్న రాజారపు సందీప్‌ను విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అభినందించారు.


