జల వనరుల పరిరక్షణకు కృషిచేయాలి
న్యూశాయంపేట: జల వనరుల పరిరక్షణ కోసం మరింతగా కృషిచేసి ఆదర్శంగా నిలవాలని రెవెన్యూశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. జల సంరక్షణ కేటగిరీ–2లో జాతీయ స్థాయిలో వరంగల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకుని కోటి రూపాయల నగదు బహుమతి అందుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అవార్డు అందుకున్న కలెక్టర్ సత్యశారదను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
కనులపండువగా
కార్తీక దీపోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో కార్తీక మాసం బుధవారం సాయంత్రం ఆలయ ఈఓ రామల సునీత కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించారు. లక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి మహిళలు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల కూచిపూడి నృత్యాలు అలరించాయి. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం హుండీ లెక్కించారు. 64 రోజులకుగాను రూ. 65,93,481 ఆదాయం లభించిన ట్లు, నగదును యూనియన్ బ్యాంకులో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. విదేశీ కరెన్సీ 2,483 యూఎస్‌ఏ డాలర్లు, 55 ఆస్ట్రేలియా డాలర్లు, 1 0 సింగపూర్ డాలర్లు, 15 యూఏఈ దిరమ్స్, 3 ఖతర్ సెంట్రల్ లభించినట్లు తెలిపారు.
విద్యారణ్యపురి: పాఠశాలల్లో సురక్షిత పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని 5.0ను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర పరిశీలకులు ప్రొఫెసర్ రవికాంత్ అన్నారు. పాఠశాలల పరిశీలన అనంతరం బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓతో కలిసి ఎంఈఓలతో నిర్వహించిన సమావేశంలో 5.0 అమలుపై సమీక్షించారు. తాను పరిశీలించిన పాఠశాలల్లోని పరిస్థితులను ప్రస్తావించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్ధులను ఆకర్షించేలా పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈనెల 20 నుంచి నిర్వహించనున్న బడిబయట పిల్లల సర్వేను ఖచ్చితత్వంతో చేయాలని సీఆర్‌పీలకు సూచించారు. సమావేశంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్‌మోహన్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ బి.మహేశ్, జెండర్ కో–ఆర్డినేటర్ సునీత, ఎస్‌ఎస్‌సీ రఘునందన్‌రావు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.
జల వనరుల పరిరక్షణకు కృషిచేయాలి
జల వనరుల పరిరక్షణకు కృషిచేయాలి


