ఏం వ్యాపారం చేశారని వందల కోట్లు సంపాదించారు..
హన్మకొండ చౌరస్తా: హరీశ్‌రావు, రామారావు, సంతోష్‌రావు, వినయ్‌భాస్కర్‌లు వైట్‌కాలర్ క్రిమినల్స్ అని, ఏ వ్యాపారాలు చేస్తున్నారని వీరికి వందల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌజ్‌లు సమకూరాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్ నాయకుల పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్కెట్‌లో పత్తి కొనుగోల్లు ఎవరు చేస్తారో కూడా తెలియని దుస్థితిలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఉన్నాడన్నారు. రూ.600కోట్ల అవినీతి చేశాడన్న ఆయన మరదలు కవిత చేస్తున్న ఆరోపణలపై ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సర్పంచ్‌ను గెలుచుకోలేరని, పైగా డిపాజిట్లు కోల్పోతారని అన్నారు. వినయ్‌భాస్కర్ ఒకప్పడు మంచిగా ఉండేవాడని, ఆ తర్వాత కబ్జాలు, రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు. సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రైతులను ఓదార్చని వీరు ఇప్పుడు ఆంబోతుల మాదిరిగా ఊళ్లపై పడి తిరుగుతున్నారన్నారు. అంతకుముందు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, టీపీసీసీ బాధ్యులు ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, నాయకులు పల్లకొండ సతీశ్, బంక సరళ, బత్తుల స్వాతి, వీసం సురేందర్‌రెడ్డి, పెరుమాండ్ల రామకృష్ణ, రామంచ ఐలయ్య, గరిగె రాజు, పెద్దమ్మ సురేశ్ పాల్గొన్నారు.
హరీశ్‌రావు, వినయ్ భాస్కర్‌లు
వైట్‌కాలర్ క్రిమినల్స్
వరంగల్ పశ్చిమ
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


