మతోన్మాదుల మెడలు వంచేది కమ్యూనిస్టులే
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు
వరంగల్: దేశంలోని మతోన్మాదుల మెడలు వంచేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీని వాసరావు అన్నారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా కు మ్రంభీం జిల్లా జోడే ఘాట్ నుంచి ప్రారంభమైన సీపీఐ బస్సు జాతా బుధవారం వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. నగరంలోని ములుగు రోడ్డు నుంచి పోచమ్మ మైదాన్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీ ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా అధ్యక్షతన పోచమ్మ మైదాన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దే శంలో నిరుద్యోగం పెరిగిందని, ఆర్థిక మాంద్యం ఏర్పడిందన్నారు. ఈక్రమంలో ప్రజలు కమ్యూనిస్టుల వైపు చూస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు మేకల రవి, పంజా ల రమేశ్, పనాస ప్రసాద్, లక్ష్మణ్, బద్రి, రమేశ్, బుస్స రవీందర్, ఏలేందర్, చంద్రకళ, చెన్నకేశవులు, శంకరయ్య, రాజు, శరత్, అక్బర్ పాషా, భవాని, యాకాంబ్రచారి, రాహేలా, జాన్‌పాల్, రవి, రమేశ్, సుధీర్, సువర్ణ, శ్వేత పాల్గొన్నారు.
పరకాలలో ఘనస్వాగతం పలికిన శ్రేణులు
పరకాల: రపజావ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా సీపీఐ నిలుస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పరకాల పట్టణానికి చేరుకున్న సీపీఐ బస్సు జాతా బృందానికి నాయకులు, కార్యకర్తలు డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగ తం పలికారు. మార్కెట్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి శ్రీని వాసరావు మాట్లాడారు. ఖమ్మంలో నిర్వహించనున్న పార్టీ వందేళ్ల ముగింపు ఉత్సవాలకు అధిక సంఖ్యలో తరలిరా వాలని పిలుపునిచ్చారు. నాయకులు కలవేన శంకర్, మరుపాక అనిల్‌కుమార్, జిల్లా నాయకులు దుప్పటి సాంబయ్య, సదా విజయలక్ష్మి, లంకదాసరి అశోక్ పాల్గొన్నారు.


