ఆడబిడ్డలకు సారె.. ఇందిరమ్మ చీర
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయమని ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై బుధవారం సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం నుంచి డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందన్నారు. సమావేశంలో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ జోనా, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, వరంగల్ జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రాంరెడ్డి, రెండు జిల్లాల,, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.
వీడియో కాన్పరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ నుంచి అధికారులతో సమీక్ష


