గురువారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఇటీవల కోర్టులో పడిన శిక్షల్లో కొన్ని..
వరంగల్ కమిషనరేట్ పరిధిలో
పెరిగిన శిక్షల శాతం
● పలు కేసుల్లో నేరస్తులపై కోర్టులో నేర నిరూపణ..
● సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న పోలీసులు
● బలమైన ఆధారాలు, సాక్ష్యాధారాల సేకరణ
వరంగల్ క్రైం:
తప్పు చేస్తే...శిక్ష తప్పదు అనే భయం నేరస్తుల్లో ఉంటేనే క్రైం రేట్ తగ్గుతుందని పోలీస్ అధికారుల భావన. నేరాల నిరూపణకు అవసరమైన ఆధారాలను సాంకేతిక పరిజ్ఞానంతో సేకరించడంతో శిక్షల సంఖ్య పెరుగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన వివిధ కేసుల్లో పోలీస్ అధికారులు పక్కా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో సమర్పించడం వల్ల నిందితులకు శిక్షలు పడుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు కూడా నిందితుల బెదిరింపులకు లొంగకుండా, ప్రలోభాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సాక్షులకు మేం ఉన్నాం...అనే భరోసాను కల్పించి సరైన సమయంలో కోర్టుల్లో వాంగ్మూలం ఇప్పిస్తున్నారు. దీంతో కోర్టులు ఆధారాలు, సాక్షులను విచారించి నేరం చేసిన వారికి శిక్ష విధించి జైలుకు పంపిస్తున్నారు.
హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో సుజాత అనే వివాహిత కుటుంబంలో జరుగుతున్న గొడవలను దృష్టిలో పెట్టుకుని తన తమ్ముడు వెంకట్ సహకారంతో భర్త శంకర్‌ను ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేశారు. ఈ కేసులో గత జూలై 14న ఇద్దరిని దోషులుగా పరిగణించి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పుఇచ్చింది.
2020లో గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మారంలోని సాయివైన్స్‌లో అర్ధరాత్రి బిర్యానీ కోసం జరిగిన గొడవలో వైన్స్‌లో పనిచేస్తున్న రమేశ్‌ను అక్కడే ఉన్న పాన్‌షాపు యజమాని ప్రభాకర్ బీర్ బాటిల్‌తో తల పగులగొట్టి హత్య చేశాడు. ఈ ఏడాది జూన్ 29న కోర్టు ప్రభాకర్‌కు జీవిత ఖైదు విధించింది.
మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం..
కోర్టులో దోషులకు శిక్షలు పడేలా మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం. ఎస్‌హెచ్‌ఓలు, ఏసీపీ, డీసీపీ స్థాయిలో ప్రతీవారం కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష నిర్వహించి అక్కడ జరుగుతున్న వాదోపవాదాలకు అవసరమైన సాక్ష్యాలను సమర్పించడం, సాక్షులకు ధైర్యం చెబుతున్నాం. ముఖ్యంగా కేసు నమోదునుంచి శిక్ష పడే వరకు ప్రతీదశలో పోలీస్ అధికారులు దర్యాప్తును పద్ధతి ప్రకారం చేయడం వల్ల శిక్షలు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో వీటి సంఖ్య మరింత పెరుగుతుంది. – సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్
●
ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధి నారాయణగిరి గ్రామానికి చెందిన ఆలకుంట రాజు, గట్టమ్మ భార్యాభర్తలు. రాజు తరచూ గొడవ పడి ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసు ఇవ్వాలని అడుగగా ఇవ్వకపోవడంతో మంచం కోడుతో ఆమె తలపై బలంగా కొట్టడంతో చనిపోయింది. 2019లో నమోదైన ఈ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాజుకు 8 ఏళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో 2019లో పోక్సో కేసు నమోదైంది. సీతంపేట గ్రామానికి చెందిన ఓ బాలికను భూపాలపల్లి జిల్లా రవినగర్‌కు చెందిన ఆకుల సాంబ మాయ మాటలు చెప్పి అపహరించినట్లు రుజువు కావడంతో అతడికి కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 21న ఏడేళ్ల శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విధించింది.
మడికొండ పోలీస్ స్టేషన్ పరిధి అమ్మవారిపేటకు చెందిన మైదం కొంరయ్య తన భార్యకు ఉరి వేసి హత్య చేసినట్లు 2024లో కేసు నమోదు కాగా.. ఈ ఏడాది జూలై 1న అతడికి జీవితఖైదు విధించింది.
2018లో మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధి శివసాయి మందిరంలో పూజారిగా పనిచేస్తున్న దేవల్ల సత్యనారాయణ శర్మను స్పీకర్ ఎక్కువ శబ్దంతో పెడుతున్నావు అనే కారణంతో ఓ ముస్లిం యువకుడు కత్తితో దాడి చేశా డు. హత్యాయత్నం కేసులో నిందితుడికి ఈ ఏడాది జనవరి 24న జీవిత ఖైదు, రూ.15వేల జరిమానా విధించింది.
గురువారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2025


