వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత
హన్మకొండ అర్బన్: వయోవృద్ధులను గౌరవించడం మనందరి బాధ్యత అని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్‌ఓ గణేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ.. తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, సీడీపీఓలు విశ్వజ, స్వరూప, ఉమ, కార్పొరేటర్ మానస రాంప్రసాద్, సూపర్‌వైజర్స్, ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ, ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ అనితారెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ప్రభాకర్‌రెడ్డి, రామ్మూర్తి, నర్సయ్య పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.భాస్కర్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చే శారు. ఇప్పటి వరకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళా శాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించగా.. ఆయన స్థానంలో భాస్కర్‌ను నియమించారు. వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులను భాస్కర్‌కు అందజేశారు.
హన్మకొండ చౌరస్తా: పిల్లలు వదిలేసినంత మాత్రాన ఒంటరిగా ఉండొద్దని, వారికి సమాజం అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభిరామారావు అన్నారు. వృద్ధుల, తల్లిదండ్రుల సంక్షేమ చట్టం–2007 వారోత్సవాల్లోని వృద్ధాశ్రమంలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా.. హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు మాట్లాడుతూ.. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు, వృద్ధులకు న్యాయ సేవలందిస్తామన్నారు. ఇతర సమస్యలేమైనా ఉంటే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామలింగం, కేయూ కౌన్సిల్ సభ్యురాలు అనితారెడ్డి, శుభ పాల్గొన్నారు.
వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత
వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత


