ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం
మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్
వరంగల్ అర్బన్: వరంగల్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని, మూడేళ్లకోసారి సెప్టిక్ ట్యాంకులను ఖాళీ చేయించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం వరల్డ్ టాయిలెట్‌డే ను పురస్కరించుకుని బల్దియా ప్రధాన కార్యాలయంలో సెప్టిక్ ట్యాంక్, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులు, శానిటేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఉత్తమ సేవలందించిన సెప్టిక్ ట్యాంక్, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులను శాలువాలతో సత్కరించారు. ఈసందర్భంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రతపై ప్రజల్లో అవగాహన కోసం సెప్టిక్ ట్యాంక్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ర్యాలీని మేయర్, కమిషనర్‌లు సంయుక్తంగా ప్రారంభించారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి ఖాజీపేట వరకు కొనసాగింది. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్, భాస్కర్, సూపరింటెండెంట్ దేవేందర్, ఆస్కీ ప్రతినిధి రాజ్‌మోహన్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


