మాడ్యూల్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: ‘లెట్స్ ఎన్‌రిచ్ అవర్ ఇంగ్లిష్’ అనే 30 రోజుల కార్యక్రమానికి సంబంధించి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రిసోర్స్‌పర్సన్స్ రూపొందించిన మాడ్యూల్‌ను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల్ని పెంపొందించేందుకు కలెక్టర్ ఆలోచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థి ఎలాంటి బిడియం లేకుండా ఆంగ్లంలో సులభంగా మాట్లాడే యాక్టివిటీస్ ఇందులో చేర్చినట్లు తెలిపారు. ఈమేరకు బుధవారం నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లోని కాంప్లెక్స్ రిసోర్స్‌పర్సన్స్‌కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, బండారు మన్మోహన్, మాడ్యూల్ రూపకర్తలు రోజారాణి, పద్మావతి, పండరీ వాసు, కోలా రవికుమార్, సంపత్, మహిపాల్ పాల్గొన్నారు.


