అతివేగంతోనే అత్యధిక ప్రమాదాలు
డీటీసీ సురేశ్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జి.సురేశ్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని అశోకా హోటల్‌లో మంగళవారం రోడ్డు భద్రత, వివిధ చట్టాల ప్రమేయం, వినియోగదారుల హక్కులపై సదస్సు నిర్వహించారు. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా సురేశ్‌రెడ్డి హాజరయ్యారు. సదస్సులో పాల్గొన్న 28 వినియోగదారుల సంఘాల ప్రతినిధులు రోడ్డు భద్రతపై సూచనలిచ్చారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై తీర్మానం ప్రవేశపెట్టగా సెమినార్ ఆమోదించింది. దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్, మున్సిపల్ ఈఈ మాధవి, జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్, బూరుగుపల్లి శ్రవణ్‌కుమార్, మామిడి భీంరెడ్డి, సుప్రభ, ప్రవీణ్‌కుమార్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.


