జల సంరక్షణలో వరంగల్ మొదటిస్థానం
కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డు
అందుకున్న కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024–25 సంవత్సరానికి గాను జల సంచాయ్, జన్ భాగీదారి 1.0 అవార్డుకు దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ–2లో వరంగల్ జిల్లాకు మొదటిస్థానం దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ చేతుల మీదుగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అవార్డుతోపాటు రూ.కోటి నగదును అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల సమష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాంరెడ్డి ఉన్నారు.


