సంఘాలు, సమాఖ్యలు అభివృద్ధి పథంలో సాగాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ: సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలు అభివృద్ధి పథంలో సాగాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుని పొదుపుతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అమూల్, ముల్కనూరు సొసై టీ, విజయ డైరీని స్ఫూర్తిగా తీసుకుని ఇతర సొసైటీలు విజయపరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు మాట్లాడుతూ.. సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా ఉత్తమ సహకార సంఘాలు, ఉత్తమ మహిళ సమాఖ్యలకు జ్ఞాపికలు అందించా రు. కార్యక్రమంలో సహకార యూని యన్ సీఎండీ అన్నపూర్ణ, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, డీసీఓ సంజీవరెడ్డి, కాకతీయ సహకార శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ యాకూబ్, నాబార్డు డీజీఎం చంద్రశేఖర్, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా మత్స్యశాఖ అధికా రి శ్రీపతి, డీసీసీబీ అధికారులు, సహకార సంఘాలు, మహిళా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలి
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ జూనియర్, వివిధ గురుకుల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించేలా కోచింగ్ ఇవ్వాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఇంటర్మీడిఝెట్ సాంఘిక సంక్షేమ, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ విద్యాలయాల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్‌ఓ వై.వి గణేశ్, డీటీడబ్ల్యూఓ ప్రేమకళ, బీసీ సంక్షేమాధికారి నరసింహస్వామి, వివిధ గరుకులాల ఆర్సీఓలు, అధికారులు పాల్గొన్నారు.


