డ్రగ్స్ రహిత నగరానికి కృషి చేయాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి సమన్వయంతో పని చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల నుంచి జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం వరకు బల్దియా అధికారులు, సిబ్బంది, కార్మికులు వివిధ కార్మిక సంఘాలు కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరితో మేయర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్‌ఈ సత్యనారాయణ సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్ ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఉప కమిషనర్లు సమ్మయ్య, ప్రసన్నారాణి, ఎంహెచ్‌ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు
పెనాల్టీ తొలగింపును వినియోగించుకోవాలి..
అసెస్‌మెంట్లకు స్వీయ కొలతలు తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల 25 రెట్లు పెనాల్టీ నమోదైన నగరవాసులు ఈ పెనాల్టీ మినహాయించి రివైజ్డ్ పన్ను చెల్లించాలని, ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని మేయర్ సుధారాణి కోరారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. సమావేశంలో అదనవు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్‌ఈ సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


