మేడం.. సమస్యలు పరిష్కరించండి
గ్రేటర్ గ్రీవెన్స్‌లో కమిషనర్‌కు వినతులు
వరంగల్ అర్బన్ : ‘మేడం.. మేం ఆస్తి, నీటి, చెత్త పన్నులు చెల్లిస్తున్నాం. కానీ మా కాలనీల్లో కనీస వసతులు లేవు. అభివృద్ధి పనులు చేయాలి’ అని పలు కాలనీల వాసులు బల్దియా కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్‌లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను కమిషనర్ ఆదేశించారు. గ్రీవెన్స్‌కు 86 దరఖాస్తులు రాగా అందులో టౌన్ ప్లానింగ్–33, ఇంజనీరింగ్– 29, రెవెన్యూ సెక్షన్‌కు–6, హెల్త్, శానిటేషన్–12, నీటి సరఫరా ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌కు వచ్చిన కొన్ని సమస్యలు ఇలా..
● 17వ డివిజన్‌లో విచ్చలవిడిగా పందులు తిరుగుతూ పిల్లలపై దాడులు చేస్తున్నాయని, 50వ డివిజన్‌లోని 1–9–1285 ప్రాంతంలోని వీధి కుక్కల అక్కడినుంచి తరలించాలని కాలనీవాసులు వేడుకున్నారు.
● 56వ డివిజన్‌లో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
● 17డివిజన్ శంభునీపేట కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదని స్వప్న, గోపి ఫిర్యాదు చేశారు.
● 29వ డివిజన్ రామన్నపేట శ్మశానవాటికలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సీపీఎం ఏరియా కమిటీ నాయకులు విన్నవించారు.
● 27వ డివిజన్ కృష్ణాకాలనీలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, న్యాయం చేయాలని 15కుటుంబాల సభ్యులు ఫిర్యాదు చేశారు.
● 55వ డివిజన్ భీమారంలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ కోసం 20శాతం కంట్రిబ్యూషన్ కోసం నిధులు వెచ్చించామని పనులు చేపట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● హనుమకొండ కంచరకుంట 2019లో లేఅవుట్ ఉందని, రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానంగా తయారయ్యాయని కొత్తగా నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● 54వ డివిజన్ హనుమాన్ నగర్‌లో రోడ్లు అక్రమణకు గురవుతున్నాయని చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
● హనుమకొండ రాయపురలోని పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలు దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేయాలని కాలనీవాసులు దరఖాస్తు చేశారు.
● 1వ డివిజన్ ఎర్రగట్టుగుట్ట వద్ద పిల్లల పార్కు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరారు.
● 56వ డివిజన్ విష్ణుపురి కాలనీలో సమస్యలు పరిష్కరించాలని స్థానికులు విన్నవించారు.
● 2వ డివిజన్ వంగపహాడ్ మెయిన్ రోడ్డులో డ్రె యినేజీ అస్తవ్యస్తంగా మారిందని, నూతనంగా నిర్మించాలని కార్పొరేటర్ రవి ఫిర్యాదు చేశారు.


