ప్రతిరోజూ తడిచెత్త ప్లాంట్‌కు చేరాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ : ప్రతి రోజు తడిచెత్త బయో కంపోస్ట్ ప్లాంట్‌కు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలో బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్మీ కంపోస్ట్ యూనిట్‌లో బయో కంపోస్ట్ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన ట్రయల్ రన్‌ను కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరానికి సంబంధించి శానిటేషన్ విధానంలో సుస్థిరమైన మార్పును తీసుకురావాలన్నారు. ఐదు బయో కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిర్వహణ తీరు తెలుసుకోవడానికి ట్రయల్ రన్‌లు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ మహేందర్, ఏఈ సంతోష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అనిల్, వావ్ ప్రతినిధి పవన్ పాల్గొన్నారు.
మహిళా సంఘాల లావాదేవీలు
పారదర్శకంగా నిర్వహించాలి
నగర పరిధిలోని మహిళా సమైక్య సంఘాలు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అమత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మా, హార్టికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ..మెప్మాతో పాటు హార్టికల్చర్ సమన్వయం చేసుకుంటూ మూడు పార్కుల్లో విధులు నిర్వహించడానికి స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీలను) గుర్తించాలని ఇందుకోసం అనుమతులు వచ్చాయన్నారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీహెచ్‌ఓ రమేష్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, టీఎంసీలు రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏఐ సాంకేతికతతో శానిటేషన్ నియంత్రణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో శానిటేషన్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఐసీసీసీ కేంద్రంలో క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడే అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా శానిటేషన్‌తో పాటు ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్లపై సమావేశం నిర్వహించారు. ఐసీసీసీ ప్రతినిధులు కేంద్రం ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. వార్డులో స్వచ్ఛ ఆటోలన్నింటికీ రూట్ ఆప్టిమైజేషన్ చేశామన్నారు.


