ఏనుమాముల.. వెలవెల
బోసిపోయిన పత్తియార్డు
నిరవధిక సమ్మె చేపట్టిన ట్రేడర్స్, మిల్లర్స్
వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా కాటన్ జిన్నింగ్ మిల్లర్లు, ట్రేడర్లు సీసీఐ అమలు చేస్తున్న నిబంధనలను నిరసిస్తూ సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని పత్తి యార్డులో విక్రయించేందుకు రైతులు ఒక్క బస్తా కూడా తీసుకురాకపోవడంతో మొత్తం వెలవెలబోయింది. పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులు, ట్రేడర్లు చేపట్టిన సమ్మె ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి విక్రయాలకు రాకపోవడంతో తూకం వేసి యంత్రాలు యార్డుల్లో మూలకు చేరాయి. సమ్మె చేపట్టిన ప్రైవేటు వ్యాపారులతో పత్తిని కొనుగోలు చేయాలని మార్కెట్‌లోని దడువాయిలు, కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమ్మైపె దృష్టి పెట్టడంతో రెండు రోజుల్లో సమ్మె విరమించే అవకాశం ఉందనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ అధికారులు మాత్రం పత్తి మిల్లుల్లోని కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు చేస్తామని అంటున్నారు. రెండు రోజుల క్రితం వరకు కొనుగోలు చేసిన పత్తిని ప్రైవేటు వ్యాపారులు యార్డుల్లో నిల్వ చేసినట్లు గుర్తించగా మార్కెట్ అధికారులు వాటిని తీసుకుపోవాలని ఆదేశించడంతో పత్తి బస్తాలను తీసుకువెళ్లారు.
ఏనుమాముల.. వెలవెల


