కార్తీక రద్దీ..
కార్తీకమాసం చివరి సోమవారం శివాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. వేయిస్తంభాల ఆలయంలో భక్తులు ఉదయమే స్వామివారి దర్శనానికి బారులుదీరారు. దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా వరంగల్ శివనగర్‌లోని రామలింగేశ్వరస్వామికి అన్నపూజ నిర్వహించారు. శివలింగాన్ని ప్రత్యేకంగా రేబాన్ కళ్లద్దాలతో అలంకరించడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ/ఖిలా వరంగల్
కార్తీక రద్దీ..


