ముగ్గురు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
హన్మకొండ: జగిత్యాల సర్కిల్‌లోని జగిత్యాల టౌన్–1 సెక్షన్ కార్యాలయంలో మద్యం సేవించిన ముగ్గురు విద్యుత్ ఉద్యోగులను యాజ మాన్యం సస్పెండ్ చేసింది. సదరు కార్యాలయంలో మద్యం విందు చేసుకున్నట్లు విచారణలో నిర్ధారణ కావడంతో అసిస్టెంట్ లైన్‌మెన్లు ఎ.ప్రభాకర్, జి.బాలకృష్ణ, వి.రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ జగిత్యాల డివిజన్ డీఈ గంగారాం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి స్పందిస్తూ విధులు నిర్వర్తించే ప్రదేశంలో ఉద్యోగులు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. విధుల నుంచి తక్షణమే తొలగిస్తామని తెలిపారు. ఈ మేరకు మెమో జారీ చేశారు. ప్రతీ ఉద్యోగి బాధ్యతతో వ్యవహరించాలని, సంస్థ ప్రతిష్టను కాపాడాలని, విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలన్నారు.
అపార్ట్‌మెంట్‌లో చోరీ
● రూ.1.30 లక్షల విలువైన రెండు ల్యాప్‌టాప్‌లు, 3వాచ్‌లు అపహరణ
ఖిలా వరంగల్ : అపార్ట్‌మెంట్‌లోని తాళం వేసి ఉన్న ఓ ప్లాట్‌లో దుండుగులు చోరీకి పాల్ప డ్డారు. బీరువాలో ఉన్న రూ.1.30లక్షల విలు వైన రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు వాచ్‌లు ఎత్తుకెళ్లారు. మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేశ్ కథనం ప్రకారం.. వరంగల్ రామ్ కీ ఎన్‌క్లేవ్ సమీపంలోని హంస కాకతీయ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌కు యజమాని ఇంద్రనీల్ చటర్జీ తా ళం వేసి ఊరెళ్లారు. గమనించిన దుండగులు శ నివారం అర్ధరాత్రి ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు వాచ్‌లు అపహరించుకెళ్లారు. ఆదివారం ఇంటికి చేరుకున్న చటర్జీ కుటుంబ సభ్యులు తాళం ధ్వంసమై ఉండడం చూసి ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి గమనించి చోరీ జరిగి నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఎస్సై సురేశ్ ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుడు చటర్జీ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రమే శ్ ఆదివారం తెలిపారు.
‘కల్లోల భారతం’,
‘ నిజాం పాలన చివరి రోజులు’ పుస్తకాల ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: ప్రజ్ఞాభారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ‘ కల్లోల భారతం’, ‘ నిజాం పాలన చివరి రోజులు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. వరంగల్‌లోని ఐఎంఏ హాల్‌లో ప్రొఫెసర్ ఎల్లాప్రగడ సుదర్శన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో న్యాయవాది చామర్తి ప్రభాకర్, సాహితీవేత్తలు గన్నమరాజు గిరిజామనోహరబాబు, రామాచంద్రమౌళి, మాల్యాల మనోహరబాబు, సౌమిత్రి లక్ష్మణాచార్య పాల్గొని రచయిత కొవెల సంతోష్‌కుమార్ రాసిన ‘ కల్లోల భారతం’, కెఎం మున్షి రాసిన ‘ ఎండ్ ఆఫ్ ద ఏరా నిజామ్స్ రూల్ ఆఫ్ లాస్ట్ డేస్’ ఆంగ్లభాష గ్రంథాన్ని కస్తూరి మురళీకృష్ణ తెలుగులో అనువదించిన ‘ నిజాం పాలన చివరి రోజులు’పుస్తకాలను ఆవిష్కరించారు. కొవెల సంతోష్ మాట్లాడుతూ దేశంతో ఉగ్రవాదం, తీవ్రవాదం ఎలా పెచ్చరిల్లుతుందో, దేశసమగ్రతకు, శాంతి భంగం కలుగజేస్తున్నారో వివరించాన్నారు. అనంతరం సహజ కవి అందెశ్రీకి శ్రద్దాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాలకృష్ణ వందన సమర్పణ చేశారు.


