రుద్రేశ్వరస్వామికి అభిషేకాలు
హన్మకొండ కల్చరల్: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. సెలవు దినం కావడంతో భ క్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు, భజనలు నిర్వహించారు. మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు.
రేపు స్వామివారి కల్యాణోత్సవం..
మాసశివరాత్రి సందర్భంగా మంగళవారం ఉదయం 10.35 గంటలకు రుద్రేశ్వరస్వామి కల్యాణం సామూహికంగా నిర్వహించనున్నట్లు ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. భక్తులు రూ.1,116 చెల్లించి రశీదు పొంది కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చునని, పాల్గొన్న దంపతులకు శేషవస్త్రాలు, తలంబ్రాలు, ప్రసాదం అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు.


