సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
రామన్నపేట: సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించవద్దని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఆదివారం నగరంలోని 22వ డివిజన్ పరిధి వాసవి కాలనీలోని ఇన్నర్ వీల్ క్లబ్‌లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పత్రిక దినోత్సవాన్ని (నేషనల్ ప్రెస్ డే) ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, నేత్ర పరీక్ష, రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో టీఎస్‌జేయూ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందికొండ మోహన్, ఆవునూరి కుమారస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్‌రావు, షుకూర్, టీఎస్ జేయూ రాష్ట్ర నాయకులు నాగరాజు, నరేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథ్, గంగరాజు, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్, శరత్ ఐ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదాన శిబిరంలో జీడబ్ల్యూఎంసీ
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్


