రేపు ఐక్యతా ర్యాలీ
హన్మకొండ: సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 18న ఐక్యతా ర్యాలీ నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కరెక్టర్ వెంకట్‌రెడ్డి ఐక్యతా ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ వరంగల్ ద్వారా ఎన్‌ఎస్‌ఎస్, ఎస్‌సీసీ సహకారంతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల నుంచి పోలీసు హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ సాగుతుందన్నారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందించడం, మాదక ద్రవ్యాల నుంచి విముక్తి కలిగించేందుకు నిర్వహిస్తున్న ర్యాలీలో యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేరా యువ భారత్ డిప్యూటీ డైరక్టర్ చింతల అన్వేశ్ పాల్గొన్నారు.


