సహకార వారోత్సవాలు షురూ
హన్మకొండ : మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించే సహకార వారోత్సవాలను శుక్రవారం హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ప్రారంభించారు. ముందుగా సహకార పతాకాన్ని చైర్మన్ రవీందర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి 21వతేదీ వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలను ‘వికసిత్ భారత నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర’ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సహకార ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ ఎండీ వజీర్ సుల్తాన్, జీఎం జి.వి.ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, గంప స్రవంతి, రాజు, కృష్ణమోహన్, సీటీఐ ట్రైనింగ్ అధికారులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.


