దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టులో నిర్వహించిన దూరవిద్య డిగ్రీ పరీక్ష బీఏ, బీకాం, బీఎస్సీ (ఇయర్ వైజ్ స్కీం ఫస్టియర్, సెకండియర్, ఎక్స్) ఫైనల్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలను శుక్రవారం వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రంతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ ఇన్‌లో ఫలితాలను చూసుకోవచ్చని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు.
17నుంచి మార్కెట్‌కు పత్తి తీసుకురావొద్దు
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ తీర్మానం మేరకు వరంగల్ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందించిన లేఖ ప్రకారం ఈనెల 17వ తేదీ నుంచి వరంగల్ మార్కెట్‌కు రైతులు పత్తి విక్రయానికి తీసుకు రావొద్దని వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేషం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి కొనుగోళ్లలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను 16వ తేదీవరకు పరిష్కారం కాని పక్షంలో 17వ తేదీ (సోమవారం) నుంచి ప్రైవేట్, సీసీఐ చేస్తున్న పత్తి కొనుగోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా నిలు పుదల చేసేందుకు అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని వివరించారు. అందువల్ల ముందస్తు సమాచారం ప్రకారం రైతులకు ఇబ్బంది కలుగకుండా సహకరించాలని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ కోరిందన్నారు.
పట్ట పగలే చోరీ
● రూ.5లక్షల నగదు,
23 తులాల బంగారం అపహరణ
పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. కల్లెడ గ్రామానికి చెందిన ఆదొండ సాయిలు కుటుంబం వ్యవసాయం చేస్తూ జీవ నం సాగిస్తున్నారు. సాయిలుకు ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడి వివాహం కా గా అతడి భార్యకి చెందిన బంగారు ఆభరణా లు, సాయిలు భార్యకి చెందిన బంగారు నగలు సుమారు 23 తులాలు బీరువాలో పెట్టి కోడలు తల్లిగారి ఇంటికి వెళ్లింది. సాయిలు, అతడి భార్య, కుమారుడు ఫంక్షన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదును ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న మామూనూరు ఏసీపీ వెంకటేశ్వర్లు, పర్వతగిరి సీఐ రాజగోపాల్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా సాయిలు ఇళ్లు ఊరికి చివరలో ఉంటుంది. ఈ క్రమంలో చుట్టు పక్కల వారు ఎవరూ లేక పోవడం, ఇంట్లో సీసీ కెమెరాలు లేనందున పోలీసులకు ఈ దొంగతనం ఘటన సవాల్‌గా మారనుంది.
దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల


