స్వచ్ఛత పాఠశాలల్లో తనిఖీలు
కాళోజీ సెంటర్: స్వచ్ఛతలో ముందుండే పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) పేరుతో ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్వచ్ఛతకు సంబంధించిన ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు ఆన్‌లైన్‌లో స్వీయ మదింపు ప్రక్రియ పూర్తి చేయగా రేటింగ్ ప్రకటించాయి. వరంగల్ జిల్లాలోని 14 పాఠశాలలు 5 స్టార్ రేటింగ్ తెచ్చుకున్నాయి.
స్వచ్ఛత ఆధారంగా రేటింగ్..
స్వచ్ఛత ఆధారంగా మార్కులు సాధించి 4, 5 స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలను జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి కమిటీలు సందర్శిస్తాయి. స్వచ్ఛత కార్యక్రమాలు, విద్యార్థులను పరిశీలిస్తాయి. 3 స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలు జిల్లాస్థాయికి, 4 స్టార్ పొందినవి రాష్ట్రస్థాయి, 5 స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలు జాతీయస్థాయికి ఎంపికై తే ప్రోత్సాహకంగా రూ.లక్ష నగదుతోపాటు కేంద్రం పురస్కారం అందించనున్నారు. యాప్ ద్వారా అప్‌లోడ్ చేసిన పాఠశాలల తనిఖీ బాధ్యతలను జిల్లాలోని 44 స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు అప్పగించారు. వారి కాంప్లెక్స్ పరిధిలోనివి కాకుండా వేరే కాంప్లెక్స్ పరిధిలోని 5, 4 స్టార్ పొందిన పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనల మేరకు ఉన్నాయా లేవా అని ఈనెల 19 వరకు పరిశీలిస్తారు. నివేదిక తయారు చేసి జిల్లా కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీలో కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, మెంబర్స్‌గా డీఈఓ, ఇంజనీరింగ్ ఎస్‌సీ, డీఎంహెచ్‌ఓ, ఎక్స్‌పర్ట్ టీచర్లు ఉంటారు. ఇందులో ఒక హెచ్‌ఎం, గెజిటెడ్ హెచ్‌ఎం, పీఎస్ హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్‌ను ఎంపిక చేశారు. హెచ్‌ఎంల టీం అందజేసిన నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అందులో నుంచి 8 పాఠశాలలను గుర్తించి రాష్ట్రస్థాయికి పంపిస్తుంది.
పరిశుభ్రతను ప్రోత్సహించడమే లక్ష్యం..
పాఠశాలల్లో పరిశుభ్రత, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా జిల్లాలో 5, 4 స్టార్ పొందిన పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని 44 స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంల బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఈనెల 19 వరకు కొనసాగుతుంది. వారు ఇచ్చిన నివేదికను జిల్లా కమిటీ పరిశీలించి 8 ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపుతుంది. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొంది జాతీయస్థాయికి ఎంపికై న పాఠశాలలకు రూ.1 లక్ష నగదుతో పాటు కేంద్రం పురస్కారం అందజేస్తారు.
– డాక్టర్ కట్ల శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్
ఈనెల 19 వరకు 44 స్కూల్
కాంప్లెక్స్ హెచ్‌ఎంల పరిశీలన
వరంగల్ జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి
ఎంపిక కానున్న 8 పాఠశాలలు
స్వచ్ఛత పాఠశాలల్లో తనిఖీలు


