విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
మహబూబాబాద్ అర్బన్ : విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడు శుక్రవారం పాఠశాలకు సెలవు పెట్టాడని ప్రిన్సిపాల్ కోటయ్య వారికి తెలిపారు. బాలల దినోత్సవం రోజు బాలికలపై అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించి సస్పెండ్ చేయాలని, ఆడపిల్లల చదువులకు భద్రత లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఇందు భారతి సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై శివ పాఠశాలకు వచ్చి విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఓ మహిళా కానిస్టేబుల్‌ను విద్యార్థినులతో మాట్లాడించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అయితే అంధుడైన సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోవడంతో ప్రిన్సిపాల్‌ను పోలీస్ స్టేషన్ తరలించారు. దీనిపై డీఈఓను వివరణ కోరగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్‌కు సమాచారం అందించామని, శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పోక్సో కేసు నమోదు
విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశామని మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. మహబూబాబాద్ పట్టణం కంకరబోర్డులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న ఇనుగుర్తి రవి పదిరోజులుగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సస్పెండ్ చేయాలని
విద్యార్థినుల తల్లిదండ్రుల ధర్నా
విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన


