బాలల హక్కుల పరిరక్షణకు కృషి
● అదనపు డీసీపీ శ్రీనివాస్
వరంగల్ క్రైం : బాలల హక్కుల పరిరక్షణకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పోలీస్ శాఖ కృషి చేస్తున్నట్లు అదనపు డీసీపీ (సీఏఆర్) శ్రీనివాస్ తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, పోలీస్ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించిన వాకఽథాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా అదనపు డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాలల రక్షణ కోసం జిల్లాలో వివిధ మాధ్యమాల ద్వారా బాల్య వివాహ నివారణ, బాలల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ముఖ్యంగా ఆన్‌లైన్ లైంగిక వేధింపులకు గురికాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బాలల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ గిరికుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్, సందసాని రాజేంద్రప్రసాద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, సీడీపీఓ విశ్వజ, బాల రక్షాభవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్.అవంతి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ సుందర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్‌చార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్, డెమో అశోక్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.


