జర్నలిస్టులు విలువలు పాటించాలి
కేయూ క్యాంపస్ : జర్నలిస్టులు విలువలను పాటించాలని న్యూఢిల్లీలోని ప్రముఖ దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్‌హాల్‌లో నిర్వహించిన జన్మధర్మ ఎంఎస్ ఆచార్య 7వ స్మారకోపన్యాసంలో జర్నలిజం–సాహిత్యంలో మారుతున్న పరిణామాలు అనే అంశంపై పలువురు ప్రసంగించారు. వార్తకు రంగు, రుచి, వాసన కాదని, వాస్తవికత కలిగి ఉండాలని తెలిపారు. తెలుగు జర్నలిజంలో ఓరుగల్లుకు చెందిన ఎంఎస్ ఆచార్య సేవలు మరువలేనివని కొనియాడారు. చాలా మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన ఘనత జనధర్మ, వరంగల్‌వాణి పత్రికకు దక్కుతుందని అన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో సత్యం, అసత్యం తేడా మసకబారిందని ఉద్ఘాటించారు. కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. నాడు కష్టకాలంలో జర్నలిజం బాధ్యతలను నిర్వర్తించిన గొప్ప వ్యక్తి ఎంఎస్ ఆచార్య అని వివరించారు. కేయూ ఇంగ్లిష్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.రాజగోపాలచారి, కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాఢభూషి శ్రీధర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం మాట్లాడారు. తొలుత ఎంఎస్ ఆచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ వి.పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అసోసియేట్ ఎడిటర్ కృష్ణారావు


