వందేమాతరం.. స్ఫూర్తి మంత్రం
రామన్నపేట: స్వాతంత్య్రోద్యమ కాలంలో వందేమాతర గేయం స్ఫూర్తి మంత్రంగా పని చేసిందని వరంగల్ జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్ ఏవీవీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వందేమాతర గేయాన్ని ఆలపించారు. ముఖ్య అతిథిగా డీఐఈఓ శ్రీధర్ సుమన్ హాజరై మాట్లాడుతూ.. వందేమాతర గేయం ప్రజల ఐకమత్యానికి దోహద పడిందన్నారు. అనంతరం వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఏవీవీ కళాశాలల ప్రిన్సిపాల్ భుజేందర్‌రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, హైస్కూల్ ఇన్‌చార్జ్ వాసుదేవులు, అధ్యాపకులు వీరేశలింగం, చండీశ్వర్, డాక్టర్ విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.


