
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయండి
హనుమకొండ అర్బన్/న్యూశాయంపేట: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లను ఆదేశించారు. ఆమె హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, అధికారులు హాజరయ్యారు.
అధికారులతో టెలికాన్ఫరెన్స్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్‌న్స్ హాల్ నుంచి మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఆరు మండలాల ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎంసీసీ నోడల్ అధికారి ఆత్మారామ్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్
రాణికుముదిని
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్