
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..
వరంగల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ ఓసిటీ స్టేడియంలో బుధవారం 69వ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, డీపీఆర్‌ఓ అయూబ్‌అలీ, జిల్లా యువజన, క్రీడల అధికారి సత్యవాణి, జీసీడీఓ ఫ్లోరెన్‌న్సా, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి సోనబోయిన సారంగపాణి, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జలగం రఘువీర్, కోశాధికారి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద
ఓ సిటీలో జిల్లాస్థాయి
పాఠశాల క్రీడలు ప్రారంభం