విద్యుత్‌ వినియోగం తగ్గింది.. | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వినియోగం తగ్గింది..

Oct 9 2025 2:37 AM | Updated on Oct 9 2025 3:27 AM

హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగం చాలా తగ్గింది. ఈ మేరకు డిమాండ్‌ కూడా పడిపోయింది. వరుసగా వర్షాలు కురవడంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. వర్షాలతో వ్యవసాయ పంటలకు భూగర్భ జలాలు తోడడానికి విద్యుత్‌ మోటార్ల వినియోగం తగ్గింది. వాతావరణం చల్లబడడంతో గృహాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం నిలిచింది. దీంతో విద్యుత్‌ వినియోగం పడిపోయింది. ఈ మేరకు విద్యుత్‌ డిమాండ్‌ కూడా తగ్గింది. టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో మొత్తంగా ఈ సంవత్సరం అక్టోబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు 385.910 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ వినియోగం జరిగింది. 2024 అక్టోబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు 542.574 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరిగింది. అదే విధంగా ప్రస్తుత సంవత్సరం ఈ నెల 1 నుంచి 7 వరకు 22,569 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా, 2024 అక్టోబర్‌ 1 నుంచి 7 వరకు 29,988 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. దీంతో భారత ఇంధన ఎక్చేంజ్‌లో విద్యుత్‌ యూనిట్‌ కొనుగోలు ధర కూడా కనిష్ఠ స్థాయికి పడిపోయిందని అధికార వర్గాలు తెలిపాయి.

అక్టోబర్‌ మొదటి వారంలో

విద్యుత్‌ వినియోగం, డిమాండ్‌ వివరాలు..

తేదీ విద్యుత్‌ వినియోగం విద్యుత్‌ డిమాండ్‌

2025సం. 2024 సం. 2025సం. 2024సం.

1 54.818 81.203 3094 4406

2 56.808 79.554 3397 4526

3 58.423 72.445 3383 4115

4 62.222 78.714 3674 4276

5 55.576 79.616 3325 4322

6 48.365 76.555 2856 4214

7 49.698 74.489 2840 4129

విద్యుత్‌ వినియోగం (మిలియన్‌ యూనిట్లలో), డిమాండ్‌ (మెగావాట్లలో)

గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన డిమాండ్‌

ఈ ఏడాది అక్టోబర్‌ మొదటి వారంలో మొత్తం విద్యుత్‌ వినియోగం 385.910 మిలియన్‌ యూనిట్లు

గత సంవత్సరం ఇదే వారంలో 542.574

మిలియన్‌ యూనిట్ల వినియోగం

విద్యుత్‌ వినియోగం తగ్గింది..1
1/1

విద్యుత్‌ వినియోగం తగ్గింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement